Wednesday, May 6, 2015

'మదర్స్ డే' అన్న దినోత్సవాలు ప్రారంభంగాకమునుపే
నాకు తెలిసిన ఓ మాతృమూర్తినిగూర్చిన  పరిచయం చేస్తాను.
అప్పట్లో ఆంధ్ర ప్రభలో మాలతీ చందూర్గారి ప్రమదావనం ప్రతివారం వస్తున్న రోజులు.ఆమే తీరిగ్గా ఆ శీర్షికకు కార్డుముక్క రాసిపడేస్తే అది రెండు మూడు వారాలతర్వాత ప్రచురితమయేది. ఒక్కోసారి పొడి అక్షరాలతో ఇంకో సారి
పూర్తి పేరుతో ప్రశ్న అడిగినవారి పేర్లు ప్రచురితమయేవి.ఆరోజుల్లో
నెలకొకసారయినా తప్పక ఆమే పేరుతో ఓ ప్రశ్న--దానికి మాలతీ చందూరు గారి అమ్మూల్యమైన జవాబూ ప్రచురితమయేది.ఆమె ఎప్పుడూ తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లనుపించేది కాదు.
తనచుట్టూ ఉన్నవారిని గురించిన సమస్యల పైనే ప్రశ్నలుండేవి.
ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే కొన్ని అగ్ని పర్వతాలు అప్పటికే ఆమె
గుండేల్లో నివాసముంటూ అప్పుడప్పుడూ భయపెడుతూ వుండేవి.అయినా ఆమే మూర్తిమంతమయిన రూపంలో ఎక్కడా తన వ్యక్తిగతమైన బాధలను గూర్చిన విషాదం తొణికిసలాడేదికాదు.అంత నిబ్బరంగా ఉండగలగడం అందరికీ సాధ్యమవుతుందని నేననుకోను.ఆ స్థిత
ప్రజ్ఞత్వం కొందరికే పరిమితమేమోననిపించేది.మగపిల్లలిద్దరూ బాగా ఎక్కొచారు.తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిపోయారు.అది తన విశ్వాసాలకు అతీతమైన వాళ్ళధోరణిని ఆమె ఎప్పుడూ అడ్డుపడిన దాఖలాకనబడలేదు.ఆడపిల్లలల్లో పెద్దవాళ్ళిద్దరికీ యోగ్యమైన ఉద్యోగాలు చేస్తున్న వారికే ఇచ్చి చేసారు.అలా రెండు దశాబ్దాలుతిరిగేసరికి రెండో అమ్మయి  స్వర్గస్తురాలయింది.అలాకొన్నాళ్ళకుని అయిదో అమ్మాయి వర్ణాంతర వివాహంచేసుకుని దూరంగా వెళ్ళిపోయింది.ఒకమ్మాయి పూర్తిగా ఈప్రపంచంతో సంబంధ బాధవ్యాలు లేనట్తుగా తన మనోవైకల్య ప్రపంచంలో తాను ఉంటుండేది. ఒక్కోసారి యేం బాధ కలిగిదోఆ పిచ్చితల్లి అఘాయిత్యాలు చేసుకునేది.[కిరసనాయిలు పోసుకుని అంటించుకోబోయింది.ఇలా జీవితం ఒడుదుడుకుల మార్గంలోనే నడుస్తున్నరోజుల్లోనే పెద్దమ్మాయి భర్త అకాలమరణానికి గురయాడు.అప్పట్లో అంత నింపాదిగా వున్న మనిషి ఇప్పుడు భర్తృవిహీనకూడా అయి మగ పిల్లలదగ్గర తన శేషజీవితాన్ని వెళ్ళదీస్తూ వుంది.ఒక్క సారి వీలయితే ఆమెను కలుసుకును నాల్కో ఇన్ని ఆటుపోటులు ఎదురుకో గలిగిన ధైర్యాన్ని పరోక్షంగా అందించిన ఆమె వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయగలిగితే ఎందరో మాతృమూర్తులకు ఆదర్శంగా నిలువగలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనమేమివ్వగలం రెండు అశ్రువులను ఆమె పాదాలమీద అసంకల్పితంగా రాల్చగలగడం తప్ప.
ఇల్లాంటి ఎందరో మాతౄమూర్తులున్నారు.ఈభూదేవంత సజనంతో తమ జీవితాలను వెళ్ళదీస్తూ .వారందరినీ ఈ వదన గ్రంధం ద్వారా స్మరించుకో గలగడమే మనకు పుణ్యమని గుర్తెరగాలి.
==========================================================

No comments:

Post a Comment