Wednesday, May 6, 2015

గృహోన్ముఖంగా-----------
=============
నేను అద్భుత సౌందర్య రాసినని
వాళ్ళు వాళ్ళ సహధర్మచారిణులదగ్గర
పొగద్తలతోనన్ను ముంచేసి గృహోన్ముఖులై
వెళ్ళిపోయారు--

నా ఇల్లు అందంగా శుచీ శుభ్రతలకూ
సోదాహరణంగా నిలుస్తుందనీ
స్తుతి పాఠాలు తద్వేకంగా వల్లించేవ్సారు.
అయినా వాళ్ళంతా గృహోన్ముఖులై వెళ్ఖ్ళిపోయారు.

వాళ్లునా అంగాగ సౌందర్యాన్ని
ఏకకాలంలోజుర్రుకున్నామనీ
ఒకటి రెండు మూడురోజులు
స్వర్గ ధామంలో ఉన్నామని విశేషంగా శ్లాఘించారు.
కానీ అంతా మరలా గృహోన్ముఖంగానే నడచివెళ్ళారు.
[Maya Angelou ఆంగ్ల    కవిత కొద్ది మార్పులతో అనువాదం]

=======================================

No comments:

Post a Comment