హిందీ చీనీ భాయీ భాయీ ఎప్పుడు పుట్టిందో ఎరుకేగాని
మావూరిలో కులాల,మతాలకతీతంగా సహజీవనం చేయడం
మాకన్నులెదుట మేము గాంచిన సత్యం.ఇది నిజం.నూటికి నూట యాభయ్యి శాతం నగ్న సత్యం.
మా ఇంటిపేరిట ఒక పీరుండేది.ముహర్రం పందుగకు ఒక పదిరోకులముందు,పదోపరకో తీసుకుని మాపీరును ముస్తాబు చేసే వాళ్ళు. పీర్ల సావిడి వైపు వెళుతుంటే ఇది మాపీరురా అని మిత్రులకు దాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పుకునే వాళ్ళం.
మావూర్లో మోతాదు ఖాసిం[సయ్యద్ ఇంటిపేరు] చాలామంది తెలుగుకన్నా స్పష్టంగా తెలుగు మాటాడే వాడు.మాపాలేర్లలో అబ్దుల్లా పదేళ్ళపాటు నమ్మకంగా ఉండే వాడు.తర్వాత మతంలో పెద్దగా మారుతూ మాదగ్గర మానేసాడు.ఆ నెలరోజులూ మరలా పీర్లను గుండాన పడ్డాయ్ అనుకునే దాకా నీచు తినకుండా నిష్టగానే వుండే వాడు. వాళ్ళాన్నయ్య కూడా అంతకు ముందు మాదగ్గరే వుండి పొలం పనులు చేస్తుండే వాదు. ఆతర్వాత మీర అనబదే వాడు రెండు దశాబ్దాలపాటుగా నమ్మిన బంటులా వుండి మమ్మల్ను ఎత్తుకు తిప్పే వాడు. అల్లగే బాపూ సాహెబ్ మాస్టారు చాల అభిమానం గా ఉండే వాడు మేమంటే.అలాగే రాయపూడినుంచి జానీ అనే బలాఢ్యుడు మా నేస్తంగా వుండి ప్రాణానికి ప్రాణమన్నట్లు వుండే వాడు.మాతోబాటే
గుంటూరులో మేమద్దెకున్న రూములోనే వుండి తనపనులు చక్కబెట్టుకుని వెళుతుండే వాడు. మావూర్లో అప్పట్లో ఉర్దూ స్కూలు వుండేది.ముఖ్యంగా అల్లీ సాహెబ్ మాస్టారూ మా పెదనాన్న ఒక తరం క్రిందటి నేస్తాల్ల కలిసిమెలసి తిరుగుతుండే వారు. వాళ్ళబ్బాయి రాయపూడిలో [ఇప్పుడు కొత్త రాజధాని ప్రాంతంలో ఉంది.] జామకాయతోటలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండే వాడు.
సంవత్సరానికొకసారి జామకాయల బస్తాతో దిగి [మా అన్నయ్యకు మంచి దోస్త్] నాల్రోజులు మాఇంట్లోనే వుండి వెళ్ళే వాడు.అలాగే పైగంబరకవిగా పేర్వడసిన సుగం బాబూ, దేవీప్రియా,మంచి స్నేహితులుగా మెలిగే వాళ్ళం. సుగ్మ తన రెక్కల కవితా ప్రక్రియ ఆలోచనను నాతోకూడా పంచుకుని తనకందిన ప్రతిరెక్కల కవితా సంపుటినీ పంపి నన్నూ రెక్కలకవిని చేసి, నా" వెలుగు రేకల' కవితా సంపుటి ఆ విర్భావానికి దోహదం చేసి ఆ కవితా సంపుటి ఆవిష్కరణ రోజు పాతమిత్రులందరితోనూ కలిసి వచ్చి,'మురళి' గారి సారధ్యంలో ఘనంగా హైద్రాబాదులో ఓ ఉత్సవం లాగా జరిపాడు.ఆ సభకు శ్రీ సలీం గారు విచ్చేసి తన సంతోషాన్ని మాతో పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణ. మా ఆవిడను అమ్మయీ అనిపిలుస్తూ .ఎంతో ప్రేమగా మసలే వాడు.ఇవన్నీ ఎందుకంటే పీర్లు గుండాన బడే ప్రక్రియలోనూ వాళ్ళ పoడుగలప్పుడు ఖీర్ అవీ ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు.
అల్లాగే మాపండుగలప్పుడు మేమూ అప్పచ్చులు ఇచ్చె వాళ్ళం.అలాగే గుంటూరులో ఇనుప బీరువాల కంపెనీ ఉన్న గాలీబూ ,పండుగకు పిలిచి సంతోషంగా ఖీరు పంచాడు.అలాగే మాతోపాతే పనిజేసిన 'వలీ' ప్రతి పండుగకూ సేమ్యాలు తెచ్చి ఇచ్చే వాడు.ఇలా ఇచ్చిపుచ్చుకునే మర్యాదా మన్ననలూ ఇరువురిమధ్యా పెరిగిన అనుబంధాలూ గూర్చి చెప్పడమే దీని లక్ష్యం తప్ప వేరుగాదనిమనవి.
------------------------------------------------------------------------------

No comments:
Post a Comment