Wednesday, April 22, 2015

నువ్వుంటే ఎంత బాగుండేదో
అని ప్రతి క్షణం ప్రతీక్షగా
ఎదురుతెన్నులతో నిరీక్షిస్తుంటాను.
ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి బాషిస్తున్నప్పుడూ
అప్పుడప్పుడూ వచ్చే జ్వరమైనా ఒక్కోసారి
ససేమిరా తగ్గనని మొండికేసినప్పుడూ
రావుగారూ మీరు బీ పీని మధుమేహాన్నీ
వెనువ్రంటనే నియంత్రించాలని ఆదేశించినప్పుడూ
నుబ్బేగనుక నా ప్రక్కన వుండి వుంటే ఎంత బాగుండునో
అని చాలాసార్లు అగణితంగా చెవుల్లోరింగుమంటూ
కలవరపెడుతుంది మనసు నువ్వే గనుక ఉండుంటే
ఎంత బాగుండునో అని,కనుకొలకుల్లోనీరు అడ్డొచ్చినా
నీ నగుమోమే నన్ను ముందుకు నడిపిస్తున్నదన్న మాట
మాత్రన్ బిరభ్యంతరంగా అక్షర సత్యం సుమా!!

నీ మనుమరాలు అన్విత మొన్న వాళ్ల ఇంటికెళితే
తాతా ఈసారి మన ఇండియాకెళ్ళినప్పుడు అమ్మమ్మను తెద్దాం
అక్కడ ఒక్కతే ఎందుకు పాపం--నువ్వుతాంతి[కాంతికి తన పలుకు బడి]
తను మాదగ్గరుంటుందిలే తాతా అని అనునయంగా చెబుతున్నప్పుడు
ఇంకోమనుమరాలికి [ఊహంటూ తెలిసి రాకుండానే నువ్వు నిష్క్రమించావులే] శ్రీ సమిటకి ఫుటొళొ నిన్ను చూపి నాబమ్మ ఎజ్జడుంది అని చిట్తి చేతులను ప్రశ్నార్ధకంగా తిప్పుతూ అడిగినప్పుడూ
నువ్వు ఆఖరి సారిగా నీ మనుమడిని[ప్జోనులోనే]నేను నిన్ను చూసి గేవపడుతున్నానురా కన్నా అని సందేశాన్ని ఆసుపత్రి మంచం మీదనుంచేఅందిస్తున్నప్పుడూఇంత సంతో షాన్ని వదిలి ఎలా వెళ్లగలిగావా అని ఆశ్చర్య పదూతుంటాబు,
========================================

No comments:

Post a Comment